ఝార్ఖండ్ లో జేఎంఎం సారథ్యంలోని కూటమి మరోసారి అధికారం చేపట్టనుంది. మెజార్టీకి అవసరమైన 41 సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో జేఎంఎం కూటమి గెలుపొందింది. ఝార్ఖండ్ లో తమదే అధికారమని ధీమా వ్యక్తం చేసిన బీజేపీ 24 సీట్లకే పరిమితమైంది. ప్రధాని మోదీ, ఇతర బీజేపీ నేతలు... అవినీతి, అక్రమ వలసల అంశాలను ప్రధానంగా ప్రస్తావించినా...ఓటర్లు జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమినే గెలిపించారు. 2019లో 47 సీట్లతో అధికారం చేపట్టిన కూటమి ఈసారి 56 సీట్లను సాధించింది. జేఎంఎం 34 స్థానాల్లో, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సీపీఐ-ML రెండుచోట్ల గెలుపొందాయి. అవినీతి కేసులో జైలుకెళ్లి ప్రస్తుతం బెయిలుపై ఉన్న సీఎం హేమంత్ సోరెన్ కూటమిని ముందుండి నడిపించారు. సంక్షేమ పథకాలతో ఓటర్లను ఆకట్టుకున్నారు. హేమంత్ అరెస్ట్ తర్వాత ఆయన సతీమణి కల్పనా సోరెన్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ బీజేపీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అనతికాలంలోనే ఆమె రాజకీయాల్లో తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశారు. సోరెన్ కుటుంబానికి చెందిన హేమంత్ , కల్పన, బసంత్ లు ఘన విజయం సాధించారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel :
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS:
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel :
☛ Visit our Official Website:
☛ Subscribe for Latest News -
☛ Subscribe to our YouTube Channel :
☛ Like us :
☛ Follow us :
☛ Follow us :
☛ Etv Win Website :
------------------------------------------------------------------------------------------------------------