ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో భారత ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి సైతం భాగమైనట్లు కెనడా మీడియాలో వచ్చిన కథనాలపై ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమ సొంత ఇంటెలిజెన్స్ అధికారులను నేరస్థులంటూ ట్రూడో మండిపడ్డారు. దురదృష్టవశాత్తు కొందరు క్రిమినల్స్ అత్యంత రహస్య సమాచారాన్ని మీడియాకు లీక్ చేయడం వల్ల తప్పుడు కథనాలు ప్రచురితమవడం చూశానన్నారు.
అందుకే విదేశీ జోక్యంపై జాతీయ విచారణ జరపాల్సి ఉందని వ్యాఖ్యానించారు. అలా చేస్తే వార్తా పత్రికలకు అత్యంత రహస్యమైన, తప్పుడు సమాచారం లీక్ అవకుండా నిరోధించగలమని ట్రూడో అన్నారు. నిజ్జర్ హత్యలో మోదీ, జైశంకర్ , జాతీయ భద్రతా సలహాదారుల ప్రమేయం ఉన్నట్లు కెనడాకు చెందిన ‘ది గ్లోబ్ అండ్ మెయిల్ ’ వార్తా పత్రిక తప్పుడు కథనాన్ని ప్రచురించింది. అయితే అది అవాస్తవమైన వార్త అని ఇప్పటికే కెనడా ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel :
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS:
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel :
☛ Visit our Official Website:
☛ Subscribe for Latest News -
☛ Subscribe to our YouTube Channel :
☛ Like us :
☛ Follow us :
☛ Follow us :
☛ Etv Win Website :
------------------------------------------------------------------------------------------------------------