
పల్లవి
॥ దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని
ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని
దారులలో ఎడారులలో - సెలయేరులై ప్రవహించుమయా
చీకటిలో కారు చీకటిలో- అగ్ని స్తంభమై నను నడుపుమయా
1. నువ్వే లేకుండా – నేనుండలేను యేసయ్య
నీ ప్రేమే లేకుండా - జీవించలేను నేనయ్య
నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే
-నే నడిచే దారుల్లో - నా తోడై వున్నావే (2)
ఊహలలో నా ఊసులలో - నా ధ్యాస బాసవైనావే
శుద్ధతలో పరిశుద్ధతలో - నిను పోలి నన్నిల సాగమని
2. కొలతే లేదయ్యా - నీ జాలి నాపై యేసయ్య
కొరతే లేదయ్యా – సమృద్ధి జీవం నీవయ్యా
నా కన్నీరంతా తుడిచావే - కన్న తల్లిలా
కొదువంతా తీర్చావే - కన్న తండ్రిలా (2)
ఆశలలో నిరాశలలో – నేనున్నా నీకని అన్నావే
పోరులలో పోరాటములో నా పక్షముగా నిలిచావే
#calvarytemplelive #newsongs #drsatishkumarsongs #latestchristiansong #calvarytemplesongs #hearttouchingsong #suhaasprince #teluguchristianmusic #teluguchristiansongs
#gospel #jesus #entertainment #telugu #jesusgospel #song #music #ypsmcl #viralvideo #viralvideos #trending #christiangospel #bible #youtuber #youtube #video #vlog #videos